నోకియాకు చెందిన మాతృ సంస్థ హెచ్ఎండీ గ్లోబల్ రెండు నూతన 4జీ ఫీచర్ ఫోన్లను భారత్‌లో విడుదల చేసింది. నోకియా 215 4జి, నోకియా 225 4జి పేరిట ఆ రెండు ఫోన్లు విడుదలయ్యాయి. వీటిల్లో వీవోఎల్‌టీఈ ఫీచర్‌ను అందిస్తున్నారు. ఈ రెండింటిలోనూ 2.4 ఇంచుల క్యూవీజీఏ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. పాలీకార్బనేట్ బాడీని ఇవి కలిగి ఉంటాయి.
ఈ ఫోన్లలో బ్లూటూత్‌కు సపోర్ట్‌ను ఇస్తున్నారు. టార్చిలైట్ ఫీచర్ ఉంది. వైర్‌లెస్ ఎఫ్ఎం రేడియో, మ్యూజిక్ ప్లేయర్, గేమ్స్ తదితర ఫీచర్లను వీటిల్లో అందిస్తున్నారు. నోకియా 225 4జి ఫీచర్ ఫోన్‌లో ప్రీమియం ఫీచర్లను అందిస్తున్నారు.
నోకియా 215 4జి, 225 4జి స్పెసిఫికేషన్స్…
* 2.4 ఇంచుల క్యూవీజీఏ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 320 x 240 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* ఆర్టీఓఎస్ (ఎస్30ప్లస్) ఓఎస్, 1 గిగాహెడ్జ్ యూనిసోక్ యూఎంఎస్9117 ప్రాసెసర్
* 64 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
* వైర్‌లెస్ ఎఫ్ఎం రేడియో, ఎంపీ3 ప్లేయర్, వీజీఏ రియర్ కెమెరా (నోకియా 225 4జిలో మాత్రమే)
* డ్యుయల్ సిమ్, బ్లూటూత్ 5.0, మైక్రో యూఎస్‌బీ
* 1150 ఎంఏహెచ్ బ్యాటరీ
నోకియా 215 4జి ఫీచర్ ఫోన్ ధర రూ.2,949 ఉండగా, నోకియా 225 4జి ఫీచర్ ఫోన్ ధర రూ.3,499గా ఉంది. వీటిని అక్టోబర్ 23వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో విక్రయిస్తారు. నవంబర్ 6 నుంచి ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో లభిస్తాయి.