వారబందీ విధానం లేకుండా చివరి ఆయకట్టు వరకు సాగు నీరందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కడెం ఆయకట్టు ప్రధాన కాలువలోకి దిగి రైతుల ఆందోళన చేపట్టారు.
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట సమీపంలోని 24 డిస్ట్రిబ్యూటరీ వద్ద తాళ్లపేట, మాకులపేట గ్రామాల రైతులు ఆందోళనకు దిగినట్లు తెలుస్తోంది. ఆయకట్టుకు నీరు ఇవ్వకపోవడంతో పొలాలు ఎండిపోతున్నాయని ఆరోపించారు. అందుకే కడెం ప్రధాన కాలువలోకి దిగారు. మోకాలి లోతు వరకు కూడా సాగు నీరందడం లేదని చూపిస్తూ రైతులు ఆందోళన చేశారు. వెంటనే తమకు సాగు నీరు అందించాలని రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.