ఏపీలోని అమరావతి ఎంపీ నవనీత్ రాణాకు ముంబయి కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. నకిలీ కుల ధ్రువీకరణ పత్రం కేసులో నవనీత్‌పై, ఆమె తండ్రిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. సెప్టెంబర్‌లోనూ ఎంపీతో పాటు ఆమె తండ్రిపై వారెంట్ జారీ అయ్యింది. ఈ క్రమంలో కొనసాగుతున్న కేసుపై కోర్టులో సోమవారం రోజున మరోసారి విచారణ జరిగింది. వారెంట్ అమలు కోసం మరింత సమయం కావాలని పోలీసులు కోరారు.
పోలీసుల విజ్ఞప్తిని తోసిపుచ్చిన కోర్టు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ నవనీత్ రాణాతో పాటు ఆయన తండ్రిపై తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ఆ తర్వాత సర్వీస్ ఆఫ్ వారెంట్‌పై నివేదికను సమర్పించేందుకు కేసు విచారణను ఈ నెల 28కి వాయిదా చేశారు. షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ అయిన అమరావతి ఎంపీ స్థానంలో నకిలీ కులధ్రువీకరణ పత్రంతో పోటీ చేసినట్లు నవనీత్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి. గతంలో బాంబే హైకోర్టు నవనీత్ రాణాకు జారీ చేసిన కుల ధ్రువీకరణపత్రాన్ని రద్దు చేసింది.