ప్రోటోకాల్ పాటించకపోవడమే పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి కారణము : మాజీ మంత్రి అంబటి

-

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేత పత్రాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వం పోలవరాన్ని నాశనం చేసిందని ఆయన ఆరోపించారు. ఇక దీనిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. పోలవరంపై చంద్రబాబుకు శ్రద్ధ లేదు అని మాజీ మంత్రి అంబటి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

కరోనా సమయంలోనూ పనులు ఆగలేదని అన్నారు .చిన్న తప్పుకూడా లేకుండా ప్రాజెక్టు పనులు జరిగాయని అన్నారు. మళ్లీ జగన్ పుంజుకుంటారనే భయం చంద్రబాబులో కనిపిస్తోందన్నారు అంబటి రాంబాబు. సీఎం అయిన తర్వాత చంద్రబాబుకు అహం పెరిగిందని మండిపడ్డారు. పదే పదే జగన్ ను దూషిస్తున్నారంటూ మండిపడ్డారు . పోలవరం ప్రాజెక్టు అంత తేలికగా అర్ధం కాదు కాబట్టే చాలా స్టడీ చేసి నిర్ణయానికి వచ్చామని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు చేసిన తప్పు వల్లే పోలవరం ప్రాజెక్టు నాశనమైందని ఫైర్ అయ్యారు. ప్రోటోకాల్ పాటించకపోవడం వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి కారణమని మాజీ మంత్రి అంబటి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version