మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో హిందూవులు, మైనార్టీలపై దాడులు ఆగడం లేదు. ఇప్పటికే పదుల సంఖ్యలో మైనార్టీలు ప్రాణాలు కోల్పోగా.. వందల మంది ఆస్తులను లూటీ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది నా అనే వాళ్లను కోల్పోయి అనాథలుగా మారిపోయారు. హిందూ సమాజానికి చెందిన నేతలపై అక్కడి ప్రభుత్వం దేశద్రోహం కేసులు పెడుతోంది.
దీంతో తమకు రక్షణ కల్పించాలని అక్కడి మైనారిటీ హిందువులు ర్యాలీలు, ఆందోళనలు చేస్తున్నారు. ముస్లింలు మెజార్టీగా ఉండే బంగ్లాలో హసీనా ప్రభుత్వాన్ని కూలదోసి ఏర్పడిన యూనస్ ప్రభుత్వంలో హిందువులపై దాడులు, వేధింపులు పెరిగిపోయాయని హిందువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే హిందూ సమాజానికి చెందిన 300 మంది శనివారం ఢాకాలో సమావేశం అయ్యారు.గత ఆగస్టు 4 నుంచి హిందువులపై 2వేల ఘటనల కంటే ఎక్కువగా దాడులు జరిగాయని మైనారిటీ గ్రూప్ ఆఫ్ బంగ్లాదేశ్, హిందూ-బౌద్ధ-క్రైస్తవ ఐక్యత కౌన్సిల్ ఆందోళన తెలిపింది.