అగ్రరాజ్యం అమెరికాలో గత కొంత కాలంగా భారతీయ ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది.చదువుల కోసం వెళ్లి ఉద్యోగం దొరికాక అక్కడే స్థిరపడిపోయిన వారు లక్షల సంఖ్యలో ఉన్నారు.ఏటా అమెరికాకు భారత్ నుంచి 10 లక్షలకు పైగానే ప్రయాణిస్తున్నట్లు సమాచారం. దీంతో అమెరికా ఎన్నికల్లో ఇండియన్ ఓటర్లకు ప్రాముఖ్యత చాలా ఏర్పడింది.
అమెరికాలో మెక్సికన్ల తర్వాత ఎక్కువమంది ఇండియాకు చెందిన వారే ఉన్నారు. ప్రస్తుతం వారి సంఖ్య 52 లక్షలు. ఇందులో 26 లక్షల మందికి ఓటు హక్కు ఉంది. చాలా ఏళ్లుగా వీరంతా డెమెక్రటిక్ పార్టీకి మద్దతుగా ఉన్నారు. ఈసారి మాత్రం అందులో కొన్ని ఓట్లు ట్రంప్ వైపు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నారు. గత నాలుగేళ్ల బైడెన్ పాలనలో నిరుద్యోగం, ద్రవ్యోల్భణం, పశ్చిమాసియా, ఆసియాలో సైతం అనిశ్చితి అని పెరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.దీంతో యువ ప్రవాస భారతీయులు ట్రంప్‌కు సపోర్టు ఇస్తున్నారని పలు సర్వే నివేదికలు చెబుతున్నాయి.