నాన్ వెజ్ అంటే ప్రాణమా? మీ చావును మీరు కొని తెచ్చుకున్నట్టే….!

-

అవును… మీరు చదివిన టైటిల్ నిజమే. నూటికి నూరు పాళ్లు నిజం. మన దేశంలోనే కాదు… ప్రపంచ వ్యాప్తంగా నాన్ వెజ్ వినియోగం విపరీతంగా పెరిగి పోయింది. ఇక.. ఆసియా గురించి మాట్లాడితే.. మాంసం వినియోగం భవిష్యత్తులోనూ పెరిగే అవకాశం ఉందట. 2050 సంవత్సరం వరకు ఆసియాలో దాదాపు 78 శాతం మాంసం వినియోగం పెరగబోతున్నదట. ఇదే.. త్వరలో డేంజర్ బెల్స్ మోగించబోతున్నది. మాంసం వినియోగం పెరగడం వల్ల రెండు రకాల ప్రమాదాలను కోరి తెచ్చుకోబోతున్నాం.

ఒకటి పర్యావరణానికి హాని. అవును.. మాంసం వినియోగం పెరగడం వల్ల గ్రీన్ హౌస్ వాయువు ఉద్గారాలు పెరుగుతాయి. అవి ఎంత పెరిగితే అంత పర్యావరణానికి హాని. మరోవైపు మాంసం వల్ల వచ్చే జబ్బులు. దాని వల్ల ఆరోగ్యం పాడవుతుంది. తద్వారా యాంటి బయాటిక్స్ తీసుకోవాల్సి వస్తుంది. దీంతో ఆయు:ప్రమాణం పడిపోతుంది. 40 ఏళ్లు దాటగానే రకరకాల జబ్బులు ఒంట్లో చేరడంతో.. 50 ఏళ్ల వయసు వచ్చేసరికి మనిషి మరణం అంచుకు చేరిపోతున్నాడు.

అందుకే.. మనిషి తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం పర్యావరణాన్ని కాపాడటం కోసం… మనిషి ఆహార అలవాట్లు మారాలి. నాన్ వెజ్ తగ్గించి.. కూరగాయలు, పండ్లు, తృణ ధాన్యాల వైపు మనిషి మళ్లాలి. రెడ్ మీట్, ప్రాసెస్డ్ మీట్ తగ్గించాలి. ఆర్గానిక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవాలి. కెమికల్ ఫుడ్ కూడా తగ్గించాలి. తిండి అలవాట్లు మార్చుకోకపోతే మాత్రం మనిషి భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version