మోడీకి కేటీఆర్ ట్వీట్‌.. వారిని చంపేయాలంటూ విన్నపం..

-

హైదరాబాద్ శివారు షాద్‌నగర్ సమీపంలో డాక్ట‌ర్ ప్రియాంక రెడ్డి హత్య, అత్యాచారం ఘటన యావత్ భారతాన్ని కుదిపేస్తోంది. ఎందరో సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వివాదంపై స్పందిస్తున్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన ఆ మాన‌వ మృగాల‌ను వెంట‌నే ఉరి తీయాల‌ని గ‌త నాలుగు రోజులుగా ఎంద‌రో పోరాటాలు చేస్తున్నారు. ఈ మేర‌కు స‌మాన్య ప్ర‌జ‌ల‌తో పాటు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు సైతం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా ప్రధాని నరేంద్ర మోడీకి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ డాక్టర్ ప్రియాంక రెడ్డి కేసు ఘటనపై ట్వీట్‌ చేశారు. ట్వీట్‌లో పలు అంశాలను ప్రస్తావించారు.

ఐపీసీ, సీఆర్పీసీ చట్టంలో మార్పులు తేవాలని కేటీఆర్‌ ట్విట్టర్‌లో కోరారు. మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, హత్యలు చేసే వారు దోషులుగా తేలిన తర్వాత వెంటనే వారికి ఉరిశిక్ష విధించాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఢిల్లీలో జరిగిన అత్యంత దారుణమైన నిర్భయ ఘటన జరిగి దాదాపు ఏడు సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ ఇంకా దోషులను ఉరి తీయలేదు. ఇటీవల 9 నెలల పిల్ల ఫై అత్యాచారం జరిగింది. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి దిగువ కోర్టు ఉరి వేస్తే…హైకోర్టు జీవిత ఖైదుగా మార్చిందని తెలిపారు. దుమ్ముపట్టిన చట్టాలను మార్చాల్సిన సమయం వచ్చిందన్నారు. చట్టానికి భయపడని మానవ మృగాల నుంచి దేశానికి రక్షించేందుకు కృషి చేద్దామని ఆయ‌న పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version