కరోనా: సాధారణ స్థితిని ఇప్పట్లో ఊహించలేం.. బిల్ గేట్స్..

-

ఏ ఉపద్రవం వచ్చినా అప్పటి వరకూ ఉన్న పరిస్థితి మొత్తం మారిపోతుంది. ఐతే సాధారణంగా ఆ మారిన పరిస్థితి ఏ ఒక్క దేశానికో, లేదా ప్రాంతానికో పరిమితమై ఉంటుంది. కానీ కరోనా సృష్టించిన భీభత్సానికి ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. ప్రపంచ వ్యాప్త ప్రజలందరూ కరోనా గురించి ఆందోళన పడుతున్నారు. వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.

ఐతే వ్యాక్సిన్ వస్తే సాధారణ పరిస్థితి వస్తుందా అనే విషయమై మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఈ విధంగా స్పందించాడు. ఫస్ట్ జనరేషన్ వ్యాక్సిన్ వల్ల ప్రపంచం సాధారణ స్థితికి రాదని, రెండవ జనరేషన్ వ్యాక్సిన్ వస్తేనే మామూలు స్థితికి చేరుకుంటామని, అప్పుడే కరోనా నుండి పూర్తిగా కోలుకున్నట్లు లెక్క అని చెబుతున్నాడు. ప్రస్తుతానికి ఫస్ట్ జనరేషన్ వ్యాక్సిన్, ఇంకా క్లినికల్ ట్రయల్స్ లోనే ఉంది. ఈ లెక్కన సాధారణ స్థితికి రావాలంటే మరో ఏడాది పడుతుందేమో..!

Read more RELATED
Recommended to you

Exit mobile version