ఉత్తరాది పార్టీ అన్న అపవాదు ఉంది.. దేశాన్ని విచ్చిన్నం చేస్తుందనే విమర్శలూ ఉన్నాయి.. హిందుత్వమే అజెండా నిర్ణయాలు తీసుకుంటుందనేది ప్రత్యర్దులు మాట.. కానీ వీటన్నింటిని బిజేపీ అధిగమిస్తోంది.. తన వ్యూహాలను మార్చుకుంటూ.. అన్ని రాష్టాల్లో మెరుగైన ఫలితాలను రాబడుతోంది.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో లోకల్ ఇష్యూస్ కి పెద్ద పీట వేస్తూ.. ప్రత్యర్ది పార్టీలను చిత్తు చేస్తోంది.. తాజగా జరిగిన ఉప ఎన్నికల్లో తిరుగులేని శక్తిగా అవతరించింది..
అసాధ్యం అనుకున్న రాష్ట్రాల్లోనూ కమలం పార్టీ దూసుకెళ్తోంది.. అసాధారణ విజయాలతో కాంగ్రెస్ కంచుకోటలను బద్దలు కొడుతోంది.. మొన్న హరియాణా విజయం.. నిన్న మహారాష్ట్ర ఘన విజయంతో తమకు తిరుగులేదని నిరూపిస్తోంది.. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన…. ఉప ఎన్నికల్లో కమలం పార్టీ స్పష్టమైన ఆధిక్యం కనబర్చింది. 21 స్థానాల్లో బీజేపీ, 9 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందాయి.
అయోధ్య, ఆర్టికల్ 370 రద్దు వంటి వాటి ద్వారా దేశ రాజకీయాల్లో బిజేపీ చెరగని ముద్ర వేసుకుంది.. వాటి అమలు తర్వాత లోకల్ అంశాలకు పెద్ద పీట వేస్తూ.. ఎన్నికలకు వెళ్తోంది.. మహారాష్ట విజయం అటుంచితే.. దేశ వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు బిజేపీ ఖాతాల్లోనే పడ్డాయి.. కొన్ని రాష్టాల్లో అధికార పార్టీ గెలిచినా.. ఉత్తర ప్రదేశ్ లోని 9 అసెంబ్లీ స్థానాల్లో ఆరింట్లో బిజేపీ.. రెండు స్థానాలు బిఎస్పీ, ఒక స్థానంలో బిజేపీ, దాని మిత్రపక్షమైన ఆర్ ఎల్ డీ విజయం సాధించాయి..
రాజస్తాన్ లో ఏడు స్థానాల్లో ఉప ఎన్నికలు జరగ్గా.. బిజేపీ 5, కాంగ్రస్ 1, బీఎడీవీపీ 1 చోట్ల గెలిచాయి.. అలాగే అస్సోంలోని ఐదు స్థానాల్లో బిజేపీ మూడు, ఏజీపీ, యూపీపీఎల్ చెరో ఒక చోట గెలిచాయి. బిహార్ లో నాలుగు చోట్ల ఉప ఎన్నికలు జరిగితే బిజేపీ రెండు స్తానాల్లో..జేడీయూ ఒకటి.. హెచ్ ఎఎం ఒక చోట గెలిచాయి..ఇలా ప్రతి రాష్టంలో ఆదిపత్యాన్ని బిజేపీ ప్రదర్శిస్తోంది.. కర్ణాటక వంటి రాష్టంలో మాత్రం ఇంతవరకు ప్రభావం చూపలేకపోయింది.. దక్షిణాధి రాష్టాల్లో కూడా తమ హవా చాటేందుకు వ్యూహాలకు పదును పెడుతోంది..