తక్కువ తినండి… ఉత్తర కొరియా ప్రజలకు కిమ్ వార్నింగ్

-

ప్రపంచ దేశాల్లో ఆదేశం రూటే సపరేటు.. ఆదేశం పేరు చెప్పగానే ఆదేశ అధ్యక్షుడు కిమ్ జోన్ ఉంగ్ తో పాటు అణ్వయుధాలే గుర్తుకోస్తాయి. అదే ఉత్తర కొరియా దేశం. తాజాగా ఆదేశ అధ్యక్షుడు కిమ్ ’దేశ ప్రజలు తక్కువగా తినాలని‘ వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఉత్తర కొరియా తీవ్ర ఆహార సంక్షోభంలో కూరుకుపోయింది. దీంతో 2025 వరకు దేశ ప్రజలు తక్కువగా ఆహారాన్ని తీసుకోవాలని అధ్యక్షుడు ఆదేశించాడు. దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి ప్రణాళికకు అనుగుణంగా లక్ష్యాలను సాధించలేదని, అందుకే ఆహార ధాన్యాల కొరత వచ్చిందని కిమ్ అక్కడి అధికారులను నిందిస్తున్నట్లు సమాచారం. దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచేందుకు మార్గాలను చూడాలని కిమ్ అధికారులను ఆదేశించారు.  గత వేసవి తీవ్రమైన వర్షాలు, వరదల కారణంగా ఉత్తర కొరియాలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇదే కాకుండా కరోనా నేపథ్యంలో ఉత్తర కొరియా సరిహద్దులను మూసివేసింది. ఇది చైనాతో వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపింది. దీని కారణంగా దేశంలో ఆహార ధాన్యాల రేటు విపరీతంగా పెరిగింది. దీని కారణంగా 25 మిలియన్లు ఉన్న ఉత్తర కొరియాలో ఆకలి చావులకు కారణమైంది. రాబోయే శీతాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని తెలుస్తోంది. 2025 వరకు చైనాతో పూర్తస్థాయిలో వాణిజ్యం మొదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version