కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో మోనిత ఇది సహజమైన గర్భం, నా మాట నమ్ము అనుకుంటూ స్రహకోల్పోతుంది. భారతి కళ్లుతెరువు అంటుంది. మోనిత సౌందర్యతో ఆన్టీ నేను చచ్చాక మీ ఇంటికోడలిగా దహనం చేయండి అంటుంది. కార్తీక్ మోనిత ఇంతలా చెప్తుంది అంటే నిజమేనా అనుకుంటాడు. భారతి ఇక ఓవర్ యాక్షన్ చేస్తుంది. మోనిత ఇంక ఎక్కువసేపు బతకదు, బతికించుకుంటావో చంపేస్తావో నీ ఇష్టం అని భారతి వెళ్లిపోతుంది. సౌందర్య భారతిని ఆపి పేపర్స్ తీసుకురా కార్తీక్ సైన్ చేస్తాడు అంటుంది. భారతి పేపర్స్ తెచ్చి ఇస్తుంది. సౌందర్య కార్తీక్ చేత బలవంతంగా సైన్ చేయిస్తుంది. కార్తీక్ సైన్ చేస్తుంటే మోనిత కళ్లల్లో ఆనందం మామూలుగా ఉండదు. ఆపరేషన్ స్టాట్ చేస్తారు.
ఇంకోవైపు దీప ఆ ల్యాబ్ సీన్ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో పిల్లలు వచ్చి ఏమైంది అమ్మా అంటాడు. నాకేమైంది, నేను బానే ఉన్నాను కదా అంటుంది. హిమ బ్లడ్ రిపోర్ట్ కోసం వెళ్లావ్ కదా ఏమైంది అని అంటుంది శౌర్య. ఓహో నువ్వు అది అన్నావా అంటుంది దీప. మరి నువ్వు ఏది అనుకున్నావ్ అంటుంది శౌర్య. దీప పిల్లలమీద చిరాకుపడుతుంది. అంతలోనే కూల్ అవుతుంది. కట్ చేస్తే హిమకు డాడీమీద కోపం పోయింది అంటుంది శౌర్య. హిమ కూడా అవునమ్మా, డాడీ మంచోడేకదా అంటుంది. దీప సమాధానం చెప్పకుండా నానమ్మవాళ్లు ఇంకారాలేదా అంటుంది. రాలేదు అంటారు. దీప మనసులో వీళ్లు నిజంగానే గుడికి వెళ్లి ఉంటారా అని అనుకుంటూ ఉంటుంది.
కారులో కార్తీక్ వాళ్లు తిరిగి వస్తుంటారు. ఏంటి కార్తీక్ ఇలా అయ్యింది అంటుంది సౌందర్య. దీపకు తెలిస్తే ఏమైతుంది అని ఇద్దరు దీప గురించి మాట్లాడుకుంటారు. దారిలో ఏదైనా గుడిదగ్గరు ఆపు కార్తీక్ అంటుంది. ఇంట్లో ప్రియమణికి మ్యాటర్ చేరవేసినట్లు ఉన్నారు. దీప అప్పుడే వస్తూ ఉంటుంది. ప్రియమణి నాటకం మొదలుపెడుతుంది. దేవుడా నువ్వు ఉన్నావ్, మా కార్తికయ్యరూపంలోనే ఉన్నావ్ అంటుంది. దీప వచ్చి అడుగుతుంది. ప్రియమణి మొదట నసిగి..జరిగింది మొత్తం చెబుతుంది. డాక్టర్ బాబు వెళ్లాడా, సంతకం చేశాడా అని దీప అంటే..అవునమ్మా వెళ్లాడంటా, సంతకం చేశాడంటా..గుమ్మడిపండంటి మగపిల్లాడు పుట్టాడంటమ్మా, కార్తీకయ్యా దేవుడు..ఏంతకోపం ఉన్నా తల్లీబిడ్డల ప్రాణాలు కాపాడాడు అని ప్రియమణి మొత్తం చెబుతుంది. దీప ఏం మాట్లాడకుండా ఏడ్చుకుంటూ వెళ్లిపోతుంది. నాకు తెలియకుండా ఇద్దరూ హాస్పటల్ కి వెళ్లారా, అత్తయ్యకూడా ఇన్ని అబద్ధాలు చెబుతున్నారా అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
తరువాయిభాగంలో కార్తీక్, సౌందర్య ఇంటికి వస్తారు. పిల్లలు ఇద్దరూ కార్తీక్ ని కౌగిలించుకుంటారు. కానీ కార్తీక్ ముఖంలో సంతోషం ఉండదు. ఆదిత్య ఏంటి మమ్మీ సడన్ గా గుడికి వెళ్లారు అంటే..దీప వచ్చి గుడికి వెళ్లటానికి భక్తి ఉంటే చాలుకదా సమయం సందర్భం ఎందుకు అంటుంది. ఏంటి అత్తయ్య అంతేకదా, దర్శనం బాగా జరిగిందా అని అడుుతుంది. సౌందర్య హూ అని పైకి వెళ్తారు. కానీ దీప కోపం, బాధ ఉండబట్టలేక..అత్తయ్య నేనేం పాపం చేశాను అత్తయ్య అంటుంది. చూడాలి రేపటి ఎపిసోడ్ లో ఎంత రచ్చ అవబోతుందో.