హైదరాబాద్ అభివృద్ధిని నార్త్ విద్యార్థులు ఓర్వలేకపోతున్నారు.. వారిపై కేసులు పెడతాం : మల్లు రవి

-

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్న నార్త్ ఇండియా విద్యార్థులపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ మల్లు రవి సంచలన కామెంట్స్ చేశారు. నార్త్ ఇండియా విద్యార్దులు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకపోతున్నారని.. అందుకే సోషల్ మీడియా లేదా యూనివర్సిటీ బయట పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.


ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేసే వాళ్ల మీద కేసులు పెడతామని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి హెచ్చరించారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ప్రతిపక్ష పార్టీ నేతలు ఆయన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తప్పులను ఎత్తిచూపిన వారిపై ఎలా కేసులు పెడతారని..ఇలా ఎంతమంది మీద కేసులు పెడుతూ వెళ్తారని ప్రశ్నిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news