పదేళ్లలో కేసీఆర్ ఒక్క తెల్ల రేషన్ కార్డులు ఇంతవరకు ఇవ్వలేదు అన్నారు మాజీ మంత్రి పుష్పలీల. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమం కోసం ఎన్నో పనులు చేసింది. 18 లక్షల తెల్లరేషన్ కార్డులను బిఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసింది.14 లక్షల మందికి కరోనా సమయంలో ఎలాంటి సహాయం చెయ్యలేదు. ఆరోగ్య శ్రీ పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం నీరు గార్చింది. కేసీఆర్ ప్రభుత్వం పేదల వ్యతిరేక ప్రభుత్వం. 18 లక్షల కార్డులను రద్దు చేసిన ప్రభుత్వం ఒక్క కొత్త కార్డును ఇవ్వలేదు.
తెలంగాణ లో ప్రజలను కేసీఆర్ తాగుబోతులను తయారు చేస్తున్నారు. పేటలను అడుకోకపోగా కేసీఆర్ కుటుంబం దుర్మగంగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. వలస కార్మికుల తెల్ల రేషన్ కార్డులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే అవన్నీ రద్దు చేశారు.పేదల పొట్టకొట్టి పెద్దలకు రాష్ట్రాన్ని దోచిపెడుతున్నారు. హైదరాబాద్ పాత బస్తి అభివృద్ధి పూర్తిగా వెనుకబడి పోయింది. రద్దు చేసిన రేషన్ కార్డులను పేదలకు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినా కూడా కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వలేదు. తెల్ల రేషన్ కార్డులను రద్దు చేయడం వల్ల ఆరోగ్య శ్రీ అమలు కాకపోవడంతో పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. కేసీఆర్ సూట్, బూట్ సర్కార్ లాగా పని చేస్తుంది. బిఆర్ఎస్, బీజేపీ కలిసి పని చేస్తుంది. పేదల పొట్టలు కొడుతుంది.