పోటీ నుంచి తప్పుకోవడం పై కిషన్ రెడ్డి క్లారిటీ..!

-

తెలంగాణ ఎన్నికల బరిలో ఈసారి తాను పోటీ చేయకపోవడంపై బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. బీసీని ముఖ్యమంత్రిని చేయాలన్నదే పార్టీ విధానం అన్నారు. తను పోటీలో ఉంటే తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని.. అందుకే తనకు పోటీ చేసే అవకాశం రాలేదన్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తా అని తాను ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఇక బీఆర్ఎస్ పాలనపై కిషన్ రెడ్డి స్పందిస్తూ.. అప్పులు చేస్తే తప్ప ప్రభుత్వం నడవని పరిస్థితి ఉందన్నారు.లిక్కర్, భూములు అమ్మకపోతే సంక్షేమ పథకాలు అమలు చేయని పరిస్థితి తెలంగాణలో ఉందన్నారు.

ఉచిత పథకాలపై బీజేపీకి స్పష్టమైన విధానం ఉందన్నారు. బీజేపీ పాలనతో దేశంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. కశ్మీర్ అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందన్నారు. గతంలో కశ్మీర్ యువత భారత వ్యతిరేక నినాదాలు చేసేవారిని ప్రస్తుతం కశ్మీర్ యువత చేతుల్లో కంప్యూటర్లు ఉన్నాయన్నారు. తెలంగాణలో అవినీతి రహిత పాలనే తమ పార్టీ విధానం అన్నారు. తెలంగాణ ఉద్యమ కారుల ఆకాంక్షలు నెరవేరాలన్నారు. కర్ణాటకలో తమ పార్టీ ఓటు బ్యాంకు తగ్గలేదన్నారు. జనతా పార్టీ కనుమరుగు కావడం వల్లే కాంగ్రెస్ గెలిచిందన్నారు. టెర్రరిజంపై బీజేపీ ది జీరో పర్సెంట్ టోలరెన్స్ అన్నారు. ప్రజల నుంచి బీజేపీకి మంచి స్పందన వస్తోందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version