వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.తనపై నమోదైన కేసులపై సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ..‘నేనే కాదు ప్రతి ఒక్కరూ పొద్దున లేస్తే సోషల్ మీడియాలో పోస్టులు చేస్తారు. వాళ్ల మీద కూడా కేసులు పెడతారా? అలా పెట్టాల్సి వస్తే భారత దేశంలో 50 లక్షల మందిపై కేసులు నమోదు చేయాలి.
పోలీసులకు మర్డర్లు, అత్యాచారాలు చేసిన నిందితులపై లేని శ్రద్ధ ఏడాది క్రితం పెట్టిన ఓ ట్వీట్‌పై ఎందుకు? సోషల్ మీడియా ఉన్నదే ఎవరి అభిప్రాయాలు వారు చెప్పుకోడానికి.. ఇలా కేసులు పెట్టుకుంటూ పోతే ఎంతమందిపై అని కేసులు పెడతారు?’ అని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. కాగా, ఆయనపై నమోదైన కేసుల విషయంలో ఆర్జీవీ పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు రిజెక్ట్ చేసిన విషయం తెలిసిందే.
నేనే కాదు ప్రతి ఒక్కరూ పొద్దున లేస్తే సోషల్ మీడియాలో పోస్టులు చేస్తారు వాళ్ల మీద కూడా కేసులు పెడతారా : అర్జీవీ
అలా పెట్టాల్సి వస్తే భారత దేశంలో 50 లక్షల మందిపై కేసులు నమోదు చేయాలి
పోలీసులకు మర్డర్లు, అత్యాచారాలు చేసిన నిందితులపై లేని శ్రద్ద ఏడాది క్రితం పెట్టిన ఓ ట్వీట్ పై… pic.twitter.com/kOmR8BYU9o
— BIG TV Breaking News (@bigtvtelugu) November 27, 2024