తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో తాజాగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే నేడు మాజీ ఎంపి జితేందర్ రెడ్డి డ్రైవర్ తాపాకు నోటీసులు ఇవ్వనున్నారు పోలీసులు. అంతేకాదు.. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి డ్రైవర్ ను, పీఏను విచారించనున్నారు పోలీసులు.
డికే అరుణ, జితేందర్ రెడ్డి ల పాత్ర పై కూడా విచారణ చేయనున్నారు పోలీసులు. మంత్రి హత్య కుట్ర కేసులో నిందితులకు ఆశ్రయం ఇచ్చాడు జితేందర్ రెడ్డి పిఏ డ్రైవర్. ఇప్పటికే మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర పన్నిన ఐదుగురు నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు సైబరాబాద్ పోలీసులు. ఇక ఈ హత్య కుట్ర కేసులో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా స్పందించారు. తనకు.. ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని.. కావాలని తనపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. దీనిపై హై కోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరించారు.