నవంబర్ 6 శుక్రవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

నవంబర్‌-6- ఆశ్వీయుజమాసం- శుక్రవారం.

మేషరాశి: ఈరోజు సంతోషంగా ఉంటారు !

మీరు చేసే పనిలో విజయం. అదృష్టం కలసి వస్తుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి లభిస్తుంది. అనుకోకుండా దూర ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. కష్టాలు చాలా వరకు ముగుస్తాయి. పనులు పూర్తిచేసుకోవడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీకు వైవాహిక జీవితం సానుకూలంగా ఉంటుంది.

పరిహారాలుః శ్రీసూక్త పారాయణం చేయండి.

todays horoscope

​వృషభరాశి: ఈరోజు అనుకోని అతిథి రాక !

ఈరోజు శుభకార్యాల గురింటి చర్చిస్తారు. ఇంట్లో సౌకర్యవంతంగా ఉండటానికి వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక అనుకోని అతిథి మీ ఇంటికి రావచ్చు. వారితో మీ కుటుంబ మొత్తం ఆనందంగా సమయాన్ని గడుపుతారు. ఈ సానుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా శుభప్రదంగా ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

పరిహారాలుః శ్రీ లక్ష్మీ అష్టోతరం పారాయణం చేయండి.

 

మిథునరాశి: ఈరోజు మీ పనులలో పురోగతి !

మీకు సహాయం చేయడానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు వస్తారు. మీ పనులలో పురోగతి వేగంగా ఉంటుంది. శాశ్వత వృద్ధి కోసం పర్‌ఫెక్ట్‌గా ప్లాన్‌ చేసుకోండి. వాదనలకు దూరంగా ఉండండి. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు ప్రయాణాలు కలసివస్తాయి.

పరిహారాలుః శ్రీసూక్త పారాయణం చేయండి. అనుకూల ఫలితాలు వస్తాయి.

 

​కర్కాటకరాశి: ఈరోజు అనుకూలంగా ఉంటుంది !

ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ శ్రేయస్సు కోసం కష్టపడి పనిచేస్తారు. ఆఫీస్‌లో వాదనలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం బాగుంటుంది. వైవాహిక జీవితం ఆనుకూలంగా ఉంటుది. ప్రయాణాలను వాయిదా వేసుకోండి. పొదుపు చేయడం ప్రారంభించండి.

పరిహారాలుః ఇష్టదేవతరాధన, ఆవునెయ్యితో దీపారాధన చేయండి.

 

​సింహరాశి: ఈరోజు ఆఫీస్‌లో సమస్యలు రావచ్చు జాగ్రత్త !

ఈ రోజు చిన్న సమ్యలను ఎదుర్కొంటారు. ఆఫీస్‌లో సమస్యలు రావచ్చు. దీనిగురించి ఆందోళన చెందుతారు. ఉద్యోగ వ్యాపార రంగంలో పూర్తి మెరుగుదల కోరుకుంటే సోమరితనాన్ని వదిలి పూర్తి ఏకాగ్రతతో పనిచేయండి. కుటుంబంలో సాధారణ పరిస్థితులు, వైవాహిక జీవితం సాధరణం కంటే తక్కువ స్థాయిలో ఉంటుంది. ప్రయాణాలు చేయకండి.

పరిహారాలుః శ్రీరామరక్షా స్తోత్రం పారాయణం చేయండి.

 

​కన్యరాశి: ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది !

మీకు కష్టపడి పనిచేసి మంచి ఫలితాలు అందుకుంటారు. ఈ రోజు తీరిక లేకుండా గడుపుతారు. అంతేకాకుండా వేగంగా పని చేస్తారు. ఫలితాలు ప్రయోజనకరంగా ఉంటాయి.  స్నేహితుల నుంచి సహాయం పొందుతారు. ఈ రోజు మీకు అదృష్టం  బాగానే ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

పరిహారాలుః ఇష్టదేవతరాధన తోపాటు గోసేవ చెప్పకోతగ్గ పరిహారం.

 

​తులరాశి: ఈరోజు వివేకంతో పనిచేయాలి !

ఈ రోజు ఆందోళన, చికాకులు ఉండే అవకాశం. ఏదైనా మీకు చిరాకు కలిగించవచ్చు. ఈ సమయంలో మీతో సమస్యలను ఎదుర్కొంటారు. వ్యాపార రంగాల్లో ఉన్న వారికి ప్రత్యర్థులు మీతో పోటీకి రాగలరు. మీరు వివేకంతో పనిచేయాలి. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా చివరికి వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది.

పరిహారాలుః శ్రీలక్ష్మీదేవి సూక్తం పారాయణం చేయండి.

 

​వృశ్చికరాశి: ఈరోజు ఆహ్లాదకరమైన వార్తలు వింటారు !

ఈరోజు ఆహ్లాదకరమైన వార్తలు వింటారు. వ్యాపారం రంగంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడుతాయి. కొత్త ప్రాజక్టులు ప్లాన్‌ చేయండి. పాత సమస్యలు ఇప్పుడు పరిష్కరించబడుతాయి. ఆఫీస్‌లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది.

పరిహారాలుః శ్రీసూక్త పారాయణం చేయడం వల్ల అనుకూల ఫలితాలు వస్తాయి.

 

​ధనస్సురాశి: ఈ రోజు లాభాలు పొందుతారు !

ఈరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కొత్త పరిచయాలు మీకు ప్రయోజనం చేకూరుస్తాయి. ఈరోజు మీరు లాభం పొందుతారు. బాకీలు తిరిగి వసూలవుతుంది. వ్యాపారులు వృద్ధి చెందుతారు. రాత్రిపూట శుభకార్యక్రమాలకు వెళ్లవడం వల్ల ప్రయోజనం పొందుతారు. దుబారా ఖర్చులకు దూరంగా ఉండండి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

పరిహారాలుః శ్రీశివాభిషేకం మంచి ఫలితాన్నిస్తుంది.

 

​మకరరాశి: ఈరోజు సంతృప్తికరంగా ఉంటుంది !

ఈ రోజు గ్రహాల కదలికల ప్రయోజనాన్ని పొందుతారు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఈ రోజు సంతృప్తికరంగా ఉంటుంది. సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మీ గౌరవం పెరుగుతుంది. ఈరోజు శుభవార్త అందుకుంటారు. అనవసరమైన ఇబ్బందులను నివారించండి. ఈ రోజు ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించే ప్రణాళికలు రూపొందించవచ్చు. ఈ రోజు వైవాహిక జీవితం సాఫీగా ఉంటుంది.

పరిహారాలుః కనకధార స్తోత్ర పారాయణం చేయండి.

 

​కుంభరాశి: ఈరోజు ప్రయాణం కలసివస్తుంది !

ఈరోజు సానుకూలంగా ఉంటుంది. అనుకోని ప్రయోజనాలు అందవచ్చు. ఉన్నతాధికారుల నుంచి సహకారం లభిస్తుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనే నిర్ణయం ఈ రోజు తీసుకోవచ్చు. ఈరోజు చేసే ప్రయాణం శుభప్రదంగా, ప్రయోజనకరంగా ఉంటుంది. సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం వల్ల అనుకూలం ఫలితాలు వస్తాయి. వైవాహికజీవితం అనుకూలం.

పరిహారాలుః ఇష్టదేవతరాధన చేయండి. సరిపోతుంది.

 

​మీనరాశి: ఈరోజు అదృష్టం కలసి వస్తుంది !

ఈ రోజు జీవితం వృద్దివైపు ప్రయాణిస్తుంది. అంతేకాకుండా అదృష్టం పూర్తిగా వరిస్తుంది. వివాదాలు సమసిపోతాయి. తెలియని శత్రువులు, అసూయపడే వారి నుంచి జాగ్రత్త పడండి. ఈ రోజు అప్పులు ఇవ్వకండి. పెద్దల సలహాలు స్వీకరించండి. వారి మార్గదర్శకత్వంలో మీరు గెలుపువైపు ప్రయాణిస్తారు. వైవాహిక జీవితంలో అనుకూలం.

పరిహారాలుః నవగ్రహాలకు ప్రదక్షణలు, ఇష్టదేవతరాధన చేయండి.

 

-శ్రీ

Read more RELATED
Recommended to you

Exit mobile version