బాలయ్యని గాడ్ ఆఫ్ మాసెస్ ఎందుకు అంటారో నాకు ఇప్పుడు తెలిసిపోయింది : శ్రద్ధ శ్రీనాథ్

-

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా హైదరాబాద్ లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. ఈ ఈవెంట్ సందర్భంగా హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ మాట్లాడుతూ మరో రెండు రోజుల్లో మన సినిమా రిలీజ్ అవుతుంది. బాలకృష్ణ గారు మీలాంటి ఒక లెజెండ్ తో వర్క్ చేయడానికి చాలా అదృష్టం ఉండాలి. నిజానికి మిమ్మల్ని కలవడానికి ముందు నాకు చాలా భయం ఉండేది. 

కానీ కలిసిన క్షణాల్లోనే మీరు నన్ను చాలా కంఫర్టబుల్ చేసేశారు. అది మీకు చాలా చిన్న విషయం కానీ నాకు, మా అందరికీ అది చాలా పెద్ద విషయం. మీరో ఒక ఇన్నోసెన్స్ ఉంది. అది చిన్న పిల్లలకు ఉండే ఇన్నోసెన్స్ లాంటిది. మీలో ఒక క్యూరియాసిటీ ఉంది. మీరు ఎంత పెద్ద స్టార్ అయినా చాలా డౌన్ టూ ఎర్త్ ఉంటారు. మిమ్మల్ని ఎందుకు గాడ్ ఆఫ్ మాసెస్ అంటారో నాకు ఇప్పుడు తెలిసిపోయింది. మీతో ఒకపాట కలిసి పని చేసే అవకాశం దొరికినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. బాబీ గారు నా క్యారెక్టర్ నందిని రాసినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను.

Read more RELATED
Recommended to you

Exit mobile version