అమిత్ షా కనిపించ‌డం లేదు.. ఫిర్యాదు చేసిన ఎన్ఎస్‌యూఐ..

-

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా క‌నిపించ‌డం లేదా ? అంటే అందుకు నేష‌న‌ల్ స్టూడెంట్స్ యూనియ‌న్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్‌యూఐ) అవున‌నే స‌మాధానం ఇస్తోంది. అమిత్ షా క‌నిపించ‌డం లేదంటూ ట్విట్ట‌ర్‌లో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. సుమారుగా 5000 కుపై గా ట్వీట్లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే ఈ విష‌యం హాట్ టాపిక్‌గా మారింది.

ఢిల్లీలోని పార్ల‌మెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేష‌న్‌లో ఎన్ఎస్‌యూఐ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి న‌గేష్ క‌రియప్ప ఫిర్యాదు చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా క‌నిపించ‌డం లేద‌న్నారు. దేశంలో ప్ర‌జ‌లు ఓ వైపు క‌రోనాతో విల‌విల‌లాడుతుంటే అమిత్ షా మాయ‌మ‌య్యార‌ని ఆరోపించారు. ప్ర‌జా ప్ర‌తినిధులు ప్ర‌జ‌ల‌కు జ‌వాబుదారీగా ఉండాల‌న్నారు. అమిత్ షాను బెంగాల్ ఎన్నిక‌ల్లో చివ‌రిసారిగా చూశామ‌ని, ఆయ‌న అప్ప‌టి నుంచి కనిపించ‌డం లేద‌ని న‌గేష్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

కాగా ఎన్ఎస్‌యూఐ జాతీయ కార్య‌ద‌ర్శి, మీడియా అండ్ క‌మ్యూనికేష‌న్స్ వింగ్ ఇన్ చార్జి లోకేష్ చుగ్ మాట్లాడుతూ 2013 వ‌ర‌కు ప్ర‌జా ప్ర‌తినిధులు ప్ర‌జ‌లకు జ‌వాబుదారీగా ఉండేవార‌ని అయితే 2014లో బీజేపీ అధికారంలోకి వ‌చ్చాక ఆ ప‌రిస్థితి మారిపోయింద‌ని అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం మాయ‌మైంద‌ని, అమిత్ షా క‌నిపించ‌డం లేద‌ని అన్నారు.

ఇక సోష‌ల్ మీడియాలోనూ అమిత్ షా క‌నిపించ‌డం లేద‌ని నెటిజ‌న్లు ట్వీట్లు చేస్తున్నారు. ర‌క‌ర‌కాల కామెంట్లు, ఫ‌న్నీ మీమ్స్ సృష్టిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version