ఎన్టీపీసీలో లో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో పలు ఖాళీలు వున్నాయి. ఈ మేరకు నోటిఫికేషన్‌ ని విడుదల చేసారు. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.

ఇక దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే.. భారత ప్రభుత్వ రంగ సంస్థ న్యూఢిల్లీలో ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అయితే దీనిలో మొత్తం 864 పోస్టులు వున్నాయి. అయితే ఈ పోస్టులు ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, మైనింగ్ ఇంజనీరింగ్‌ విభాగాల్లో ఉన్నట్టు నోటిఫికేషన్ ద్వారా తెలిపారు.

ఇక ఎవరు అర్హులు అన్నది చూస్తే… 65 శాతం మార్కులతో బీటెక్ ప్యాస్ అయిన వాళ్లు అప్లై చేసుకో వచ్చు. అలానే గేట్ 2022కి హాజరై ఉండాలి. వారే ఈ పోస్టులకి అర్హులు. ఇక వయస్సు వివరాలను చూస్తే..అభ్యర్థుల వయసు దరఖాస్తు 27 ఏళ్లు మించకూడదు.

ఇక సాలరీ వివరాలను చూస్తే.. నెలకు రూ. 40,000 నుంచి రూ. 1,40,000 వరకు పే చేస్తున్నట్టు తెలుస్తోంది. నవంబర్ 11 అప్లై చేసుకునేందుకు ఆఖరి తేదీ. పూర్తి వివరాలను https://careers.ntpc.co.in/openings.php లో చూసి తెలుసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version