ఊర మాస్‌ లుక్‌తో NTR30 టైటిల్ రివీల్‌.. దేవర అంటూ..

-

యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తోన్న NTR30 మూవీ ఫస్ట్ లుక్ వచ్చేసింది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న ప్రాజెక్ట్ టైటిల్ రివీల్ చేశారు మేకర్స్. ఆ చిత్రానికి ‘దేవర’ టైటిల్ కన్ఫర్మ్ చేస్తూ.. తారక్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. శత్రువులను మట్టుబెట్టి చేతిలో ఆయుధంతో కనిపిస్తున్న ఎన్టీఆర్.. ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం సమర్పిస్తున్న సినిమాకు సుధాకర్ మిక్కిలినేని, కోసరాజు హరికృష్ణ నిర్మాత కాగా.. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ కానున్నట్లు ప్రకటించారు.

శత్రువులను చీల్చి చెండాడిన సింహంలా.. సముద్రపు ఒడ్డున నిలబడిన కాల యముడిలా ఫస్ట్ లుక్ పోస్టర్‌లో జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని ఊర మాస్ లుక్‌లో ఎన్టీఆర్ ఆశ్చర్యపరిచారు. ఈ ఊర మాస్ లుక్‌ను ఎన్టీఆర్ అభిమానులు విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. లుక్ అదిరిపోయిందని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version