BREAKING : రూ. 2 వేల నోట్లపై RBI సంచలన నిర్ణయం… వెంటనే బ్యాంకు లో డిపాజిట్ చేసుకోండి !

-

గతంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజల మెప్పును పొందడానికి భారతదేశాన్ని అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పి చాలా నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. అందులో ఒక నిర్ణయమే డిమానిటైజేషన్…. ఈ డెమానిటైజేషన్ లో భాగంగా అప్పటికే వాడుకలో ఉన్న పాత్ర రూ. 500 మరియు రూ. 1000 నోట్లను అర్దాంతరంగా ఒక రాత్రి పీఎం ప్రకటన చేసి రద్దు చేయడం జరిగింది. ఈ రెండింటి ప్లేస్ లో కొత్తగా రూ. 2 వేల నోటును తీసుకువచ్చారు. అయితే అప్పటికే సామాన్యుల దగ్గర ఉన్న పాత నోట్లను బ్యాంకు లలో మార్చుకోవడానికి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కాగా ఆ తర్వాత కొంతకాలం పాటు అవి వాడుకలో ఉన్నాయి. అయితే ఈ మధ్యన సరిగా పరిశీలిస్తే ఈ నోట్లు మనకు ఎటిఎం లలో రాకపోవడాన్ని గమనించవచ్చు. అయితే తాజాగా రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా ఈ నోటుపై సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది.

ఇకపై ఈ నోట్ లను సర్క్యులేషన్ నుండి తొలగిస్తూ నృణాయం తీసుకుంది. ప్రజల వద్ద ఉన్న ఈ నోట్లను బ్యాంకు లలో మార్చుకోవడం లేదా డిపాజిట్ చేసుకోవడం చేయవచ్చని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version