అరుదైన రికార్డు సృష్టించిన ఎన్టీఆర్.. దూసుకుపోతున్న భీమ్ టీజర్

-

మళ్లీ తనకు ఎంతో ఇష్టమైన జక్కన్నతో కలిసి ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. ఇక ఇందులో కొమురం భీమ్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ తో కలిసి మొదటిసారి సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీపై ప్రపంచ వ్యాప్తంగా అంచానలు ఓ రేంజ్ లో ఉన్నాయి. దీని కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 13న ఈ సినిమా విడుదల కాబోతోంది. చెర్రీకి జోడీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, ఎన్టీఆర్ కు జోడీగా బ్రిటన్ మోడల్ ఓలివియా మోరీస్ నటిస్తుండగా.. బాలీవుడ్ అగ్ర నటుడు అజయ్ దేవ్‌గన్, శ్రియా శరణ్ సహా పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పటికే రిలీజైన రామరాజు, భీమ్ టీజర్ లు ఎంతగా ఆకట్టుకున్నాయో చూశాం. ఇప్పుడు భీమ్ టీజర్ ఓ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు యూట్యూబ్ లో 50 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటి వరకు 50 మిలియన్ల వ్యూస్ మార్క్ దాటిన తొలి తెలుగు సినిమా టీజర్ గా రికార్డు సృష్టించింది. అంతే కాదండోయ్ దీనికి1.3 మిలియన్ లైక్స్.. 1.4మిలియన్ కామెంట్స్ రావడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఈ వార్త విన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ సంబురాలు చేస్తూ వైరల్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version