సినీ ఇండస్ట్రీలో హీరోల లాగా హీరోయిన్లు ఎక్కువ కాలం కంటిన్యూ చేయలేరు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోని కొంతమంది ఒకటి రెండు సంవత్సరాలకే ఫేడ్ అవుట్ అవుతూ ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటారు. ఇకపోతే అందులో కొంతమంది రీ ఎంట్రీ ఇచ్చి తమ సెకండ్ ఇన్నింగ్స్ ను మొదటి పెడితే మరి కొంత మంది ఇంటికే పరిమితం అవుతున్నారు. కానీ ఇంకొంతమంది డబ్బు సంపాదించాలనే ఆలోచనతోనే బిజినెస్ రంగం వైపు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోని ఎన్టీఆర్ హీరోగా వచ్చిన సింహాద్రి సినిమాలో హీరోయిన్ గా నటించిన అంకిత కూడా బిజినెస్ రంగం వైపు అడుగులు వేసింది.
తర్వాత ఈమె చేసిన కొన్ని పొరపాట్ల వల్ల ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్లే పరిస్థితి ఏర్పడింది. తర్వాత విశాల ఝాటక్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకొని ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది . ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఇక ప్రస్తుతం తన తండ్రి యొక్క వజ్రాల వ్యాపారాన్ని ఈమె కొనసాగిస్తూ ఉండడం విశేషం.. అంతేకాదు ఇప్పుడు సినిమాలలోకి వచ్చే అవకాశమే లేదని కూడా చెప్పింది అంకిత.