ఎన్టీఆర్ పేరు మార్చడంపై జూనియర్ ఎన్టీఆర్ సీరియస్

-

ఎన్టీఆర్ పేరు మార్చడం చాలా పెద్ద తప్పు అని వైఎస్‌ షర్మిల ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్చేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నిర్ణయం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించిన బిల్లును నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

అయితే.. దీనిపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందించారు. ఎన్టీఆర్ పేరు తీసేసి వైయస్సార్ పేరు పెడితే… ఆయన గౌరవం పెరగదని సీఎం జగన్ కు చురకాల అంటించారు ఎన్టీఆర్.ఎన్టీఆర్, వైఎస్‌ఆర్‌ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు.. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్‌ఆర్‌ స్థాయిని పెంచదు, ఎన్టీఆర్‌ స్థాయిని తగ్గించదన్నారు జూనియర్‌ ఎన్టీఆర్.

విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేదని ట్వీట్ చేశారు జూనియర్‌ ఎన్టీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version