జాగా ఉండి, ఇల్లు కట్టుకునే వారికి త్వరలోనే రూ.3 లక్షలు – కేటీఆర్

-

కలెక్టరేట్ లో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసే రాష్ట్రస్థాయి ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…పేదింటి ఆడబిడ్డల మోముల్లో చిరునవ్వులు చూసేందుకు , సిరిసిల్ల లో నేత కార్మికులకు పని కల్పించేందుకు ఆత్మహత్యలు దూరం చేసేందుకు బతుకమ్మ పండుగ సారె గా బతుకమ్మ చీరలు అని పేర్కొన్నారు.

ప్రతి సంవత్సరం రూ.300 కోట్ల బతుకమ్మ చీరల కోసం వెచ్చిస్తున్నామని…చేనేత కార్మికులు 40 శాతం, మర కార్మికులకు 10 శాతం నూలు రాయితీ ఇస్తున్నామని వెల్లడించారు.టెక్స్టైల్ పార్క్ లో జుకి మేషజన సమ్మర్దక శిక్షణ కేంద్రం పెట్టాం…అపెరల్ పార్క్ లో 8-10 వేల మంది మహిళలకు త్వరలోనే ఉపాధి కల్పిస్తున్నామని ప్రకటన చేశారు.

పెద్దూర్ లో 80 ఎకరాల్లో వీవింగ్ పార్క్ ను ఏర్పాటు చేయనున్నాం…పక్క రాష్ట్రం తమిళనాడు తిర్పూర్ లో ప్రతి సంవత్సరం ప్రపంచ విపణి లో 40 వేల కోట్ల వస్త్ర ఎగుమతులు చేస్తున్నారన్నారు. సిరిసిల్ల లో 2 వేల కోట్లు మాత్రమేనని…న్యూజిలాండ్ లో రాజన్న సిరి పట్టు పేరుతో సిరిసిల్ల చీరలకు బ్రాండింగ్ చేస్తున్నారు…కొత్త తరహా ఆలోచనల తో తీర్పూర్ ధీటుగా సిరిసిల్ల ను తీర్చిదిద్దుదామని తెలిపారు.

మహిళల అభిరుచులకు అనుగుణంగా కోటి చీరలు సిద్ధం చేశాం…తెలంగాణ మొత్తం కు బతుకమ్మ పండుగ కానుక అందించే చీరలు సిరిసిల్ల నుంచే ఉత్పత్తి కావడం మనందరికీ గర్వ కారణని వెల్లడించారు. త్వరలోనే స్వంత జాగాలో ఇండ్లను నిర్మించుకునే పేదలకు ప్రభుత్వము తరపున రూ.3 లక్షలు అందించే కార్యక్రమం ను ప్రారంభిస్తామని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version