ఆ సినిమా చూసి ఏకంగా కుర్చీలనే విరగొట్టిన ఎన్టీఆర్.. కారణం..?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బాబాయ్, అబ్బాయి గా గుర్తింపు తెచ్చుకున్న బాలకృష్ణ ,ఎన్టీఆర్ ల గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నందమూరి ఫ్యామిలీ కి చెందిన ఇద్దరూ కూడా ఎన్టీ రామారావు తర్వాత ఆయన నట వారసత్వాన్ని అందిపుచ్చుకుని ఇప్పటికీ స్టార్ స్టేటస్ ను కొనసాగిస్తున్నారు. ఇక వీరిద్దరి మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉంది అన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ కు బాబాయ్ బాలకృష్ణ అంటే ఎంతో ఇష్టం. చిన్నప్పటినుంచి బాబాయ్ బాలయ్య సినిమాలు చూస్తూ పెరిగారు ఎన్టీఆర్. ఇక బాలయ్య సినిమాలకు ఎన్టీఆర్ వీరాభిమాని అని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఈ క్రమంలోనే ఎన్టీఆర్ బాలయ్య చేసిన ఒక సినిమా చూసి ఏకంగా కుర్చీలనే విరగొట్టాడట.

ఇక అసలు విషయంలో కి వెళ్తే.. బాలకృష్ణ నటించిన నరసింహ నాయుడు సినిమా మొదటిరోజు థియేటర్లో చూశాను అని తెలిపారు ఎన్టీఆర్. ఇక ఈ సినిమా చూస్తున్నప్పుడు ఎంతో ఎమోషనలయ్యా అని, దాంతో తన ముందున్న కూర్చుని ఒక తన్ను తన్నానని తెలిపారు. ఇక ఈ కుర్చీ విరగడంతో అందులో నుండి తాను కూడా కింద పడి పోయాను అని కూడా తెలిపారు. అంతలా బాబాయి సినిమాలకు వీరాభిమానిని అని తెలిపాడు ఎన్టీఆర్. ఇకపోతే ఈ మధ్యకాలంలో వీరిద్దరు కూడా పెద్దగా మాట్లాడుకోవడం లేదు అని వార్తలు బాగా వినిపిస్తున్నాయి.

ఇక కొంతమంది వ్యక్తుల కారణంగానే బాలయ్య బాబు ఎన్టీఆర్ కి కాస్త దూరంగా ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు కోడై కూస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఎన్టీఆర్, బాలకృష్ణ కలిసి నటిస్తే చూడాలని ఎంతో మంది అభిమానులు సైతం కోరుకుంటున్నారు. మరి ఈ కల నెరవేరుతుందా లేదో తెలియాలంటే ఇంకొంత కాలం అయినా ఎదురుచూడక తప్పదు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version