ఇదొక వ్యక్తి కల. 15 ఏళ్లయినా మారని పట్టుదల చెక్కుచెదరని సంకల్పానికి మరో రూపుల, తెలుగులో నెంబర్.1 న్యూస్ ఛానల్ గా నిలబడ్డ వేళ, ఇవాళ ఆ కలని, ఆ కలకన్న వ్యక్తిని తలచుకోవడం ఒక చారిత్రక అవసరం. ఆ కళ, ఎన్ టీవీ. ఆ వ్యక్తి తుమ్మల నరేంద్ర చౌదరి.
2007, ఆగస్టు 30 న్యూస్ ఛానల్ కి నిర్వచనమే సరిగ్గా కుదురుకొని రోజులవి. లైవ్ ప్రసారాలు అంటే అర్థమే పూర్తిగా స్థిరపడని కాలమది. టెక్నాలజీ ఇంకా శైశవ దశ దాటని సందర్భం అది. ప్రసారమయ్యే వార్తలకి, ప్రజాహితానికి మధ్య అప్పటికి అగాధాలు ఉండేవి. ఆ పరిస్థితుల్లో న్యూస్ చానల్స్ ప్రపంచం లకి ఒక విప్లవంలా వచ్చింది, ఎన్ టీవీ. అప్పటికే ఉన్న చానల్స్ కి అదనంగా మరో ఛానల్ లా రాలేదు. ఆ తర్వాత రాబోయే అనేక ఛానల్స్ కి మార్గదర్శిగా వచ్చింది. అసలు న్యూస్ చానల్స్ టెక్నాలజీ అంటే ఏంటో చూపించే చుక్కనీల వచ్చింది. న్యూస్ కి ఉన్న ప్రయోజనం ఏంటో చాటి చెప్పి వెలుగు రేఖల వచ్చింది. బేకింగ్ న్యూస్ కి మారుపేరైన ఒక ప్రభంజనంలా వచ్చింది. రావడమే కాదు, దిగ్విజయంగా 15 ఏళ్లు పూర్తి చేసుకుని ఈరోజు తెలుగు న్యూస్ చానల్స్ లో నెంబర్ వన్ గా నిలిచింది. ఈ దిగ్విజయ ప్రయాణం అంతా ఒకే ఒక్క వ్యక్తి ఆశయంతో సాగుతోంది. ఆ వ్యక్తి తుమ్మల నరేంద్ర చౌదరి.
న్యూస్ చానల్స్ కి సరికొత్త నిర్వచనం గా ఎన్టీవీ అయితే.. అసలు ఆధ్యాత్మిక ఛానల్ అనే ఆలోచనకే అంకురమైంది… భక్తి టీవీ. ఏటా భక్తి టీవీ ఆధ్వర్యంలో జరిగే కోటి దీపోత్సవం తెలుగు నాట ఒక మహోత్సవం. ఆ తర్వాత కొద్ది రోజులకే ఈ సంస్థ నుంచి వచ్చిన మరో ఆణిముత్యం.. వనితా టీవీ. మహిళలకు ఆసక్తులకు, అభిరుచులకు అద్దం పట్టే వనిత టీవీ… దాని కదే ఒక విలక్షణ ప్రయోగం. మహిళల కోసం దక్షిణ భారతదేశంలో తొలి ఛానల్ తీసుకురావాలన్న ఆలోచన ఒక సాహసం. ఆ సాహసం చేసింది కూడా నరేంద్ర చౌదరే. ప్రారంభించడం తేలికే. కానీ మొదలు పెట్టిన పనిని విజయంగా కొనసాగించడమే అసలు యజ్ఞం. నరేంద్ర చౌదరి ఆధ్వర్యంలోని మూడు చానళ్లు ఆ యజ్ఞాన్ని నిరాగంఠంగా కొనసాగిస్తున్నాయి.
ఏడాదికాలంగా ఏంటివి తెలుగులో నెంబర్ వన్ ఛానల్ గా కొనసాగుతోంది. ఏ బాధ్యతతో, ఏ కట్టుబాటుతో ప్రయాణాన్ని ప్రారంభించిందో… 15 ఏళ్లయినా ఇప్పటికీ అదే నిబద్ధతను నిలబెట్టుకుంటుంది. నిజానికి ఎన్ టివి ఎంట్రీ తో న్యూస్ ఛానల్ లో సీన్ మారిపోయింది. ప్రతిక్షణం, ప్రత్యక్ష ప్రసారం, ప్రతిక్షణం.. ప్రజలహితం అంటూ ఎప్పటికప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ప్రాంతం నుంచి దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి… కూడా ప్రత్యక్ష ప్రసారలతో ఎన్టీవీ ఒక కొత్త ఒరవడిని తీసుకువచ్చింది. వార్తలు చెప్పడంలో విలక్షణత చూపిస్తూ జనం గొంతుకగా నిలిచింది. ఓబి వ్యాన్లతో వార్తా ప్రసారల స్థాయిని పెంచుతూ అసలు లక్ష్యం ప్రజాహితమే అంటూ దూసుకు వెళ్లింది. ప్రతి వార్తకి ప్రజలే కేంద్రం కావాలి. ప్రతి కార్యక్రమానికి ప్రజాహితమే లక్ష్యం కావాలి. జనకాంక్షకు ప్రతిక్షణం ఎన్టీవీ వేదిక కావాలన్న లక్ష్యంతో.. కేవలం వార్తా ప్రసారాలకే పరిమితం కాకుండా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమైంది.
ఆది నుంచి ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించడంలో తన ప్రత్యేకతను చాటుకుంది ఎన్ టీవీ… విద్యార్థులు, ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందించేలా జాతీయ గీతాలాపన నిర్వహించింది. మన దేశం మన గీతం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా జాతీయ గీతాలాపనలో కోట్లాది మందిని కదిలించింది. ఇక ఎన్నికల సర్వేలు అంటే ఎన్టీవీకి పెట్టింది పేరు… ఎన్ టివి సర్వేలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అవి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచాయి. ఇలా ఎన్ టీవీ ఎప్పటికప్పుడు వార్తా ప్రసారాల్లో కొత్త ట్రెండ్ సృష్టిస్తూ వచ్చింది. అంతేకాదు మరోవైపు ట్రెడిషన్ ను కూడా ఫాలో అవుతూ వచ్చింది. కోటి దీపోత్సవం పేరుతో ప్రతి ఏడాది ఎన్ టీవీ భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతారంటే… ఈ కార్యక్రమానికి ప్రజల్లో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసుకోవచ్చు. సనాత ధర్మ పరిరక్షణ కోసం ఎన్నో కార్యక్రమాలను నిర్వహించింది.
పీఠాలను పీఠాధిపతులను ధర్మకర్తలను ఇలా ఎంతోమందిని కోటి దీపోత్సవం పేరుతో సామాన్యులకు చేరువ చేసింది. అడుగడుగునా అరుదైన విజయాలు సొంతం చేసుకుంటూ 15వ వసంతంలోకి అడుగుపెడుతోంది. ఈ సుదీర్ఘ దిగ్విజయ ప్రయాణంలో ఉద్యోగుల శ్రమ ఎంత ఉందో యాజమాన్య నిబద్దత కూడా అంతే ఉంది. ఛానల్ ప్రసారాల్లోనే కాదు, ఉద్యోగుల బాగోగులు చూడడంలో కూడా. అదే నిబద్ధత కనిపిస్తుంది. ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారి, ఆర్థిక వ్యవస్థను విచ్చిన్నం చేసింది. అది మీడియా రంగాన్ని కూడా తాకింది. అలాంటి సమయంలోనూ ఎన్నో సంస్థలు తమ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి ఇబ్బందులు పడ్డాయి. కానీ ఎన్టీవీ యాజమాన్యం మాత్రం పైసా తగ్గించకుండా ఒక్కరోజు ఆలస్యం కాకుండా ఉద్యోగులకు జీతాలను అందించింది. సమాజానికి పాత్రికేయులు అలాగే పాత్రికేయ వృత్తి ఎంతో అవసరమైన ప్రస్తుత సందర్భంలో సక్సెస్ఫుల్ గా 15 వసంతాలు పూర్తి చేసుకున్న ఎన్టీవీ మరింత దిగ్విజయంగా ముందుకు సాగాలని ఆశిద్దాం.