విద్యార్థులకు అలర్ట్‌.. పీజీ కోర్సుల పరీక్ష హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో

-

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల పరీక్ష హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఓయూ కంట్రోలర్‌ ఆఫ్‌ ది ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ నగేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని పీజీ కోర్సుల రెండు, నాలుగో సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షలను వచ్చే నెల 2వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. హాల్‌టికెట్లను ఓయూ వెబ్‌సైట్‌ www.osmania.ac.inలో చూసుకోవచ్చని ఆయన సూచించారు. హాల్‌టికెట్లలో ఏమైనా మార్పులు ఉంటే పరీక్షకు ముందురోజే మార్చుకోవాలని నగేశ్‌ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే సీయూఈటీ పీజీ (CUET PG) అడ్మిట్‌ కార్డులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ విడుదల చేసింది.

అభ్యర్థులు cuet.nta.nic.in వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ పరీక్షను యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ తరఫున ఎన్‌టీఏ నిర్వహిస్తున్నది. సెప్టెంబర్‌ 1 నుంచి 11 వరకు రెండు సెషన్లలో జరుగనుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌ పరీక్ష ఉంటుంది. కాగా, ప్రస్తుతం సెప్టెంబర్‌ 1, 2, 3 తేదీల్లో పరీక్షలు ఉన్న అభ్యర్థుల హాల్‌ టికెట్లు మాత్రమే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. మిగినవారివి త్వరలోనే విడుదల చేయనుంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version