ఒడిశాలోని పూరి జిల్లాలో విచిత్రమైన ఘటన జరిగింది. తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అర్ధ నగ్నంగా ఊరేగించాడు. వివరాల్లోకి వెళితే… ఓ వ్యక్తి కాలేజీ లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. అతడు తన భార్యతో విభేదాల కారణంగా వేరుగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే అతని భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. రెడ్ హ్యాండెడ్ గా భార్యను పట్టుకోవాలని భర్త కొంతమందితో కలిసి ఆమె ఇంటికి వెళ్ళగా ఆ మహిళ మరో వ్యక్తితో అసభ్యకరమైన రీతిలో కనిపించింది. దీంతో వారిద్దరిని వీధుల్లోకి లాక్కొచ్చి చెప్పులతో కొట్టారు.

తన భార్యతో పాటు అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి దుస్తులు విప్పి మెడలో దండలు వేసి పోలీస్ స్టేషన్ ముందే తిప్పారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఇలా చేయడం ధైర్య సాహసమే అని కామెంట్లు చేస్తున్నారు. స్త్రీలు ఇంట్లో భర్తలను వదిలేసి అక్రమ సంబంధాల బాట పడుతున్నారు. అలాంటివారికి ఇలా చేయడం సరైన పని అంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.