భారీ వర్షాల కారణంగా జమ్మూ కాశ్మీర్ లో చాలా చోట్ల రోడ్లు తెగిపోయాయి. హైవేలు అన్ని పూర్తిగా మూసేశారు. దీంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించడంతో యాపిల్ రైతులు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. చేతికొచ్చిన పంటతో లారీలలో బయలుదేరిన వారు గత 20 రోజుల నుంచి రోడ్లపైనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో లారీల్లో పెట్టిన యాపిల్స్ అలానే ఉండడం వల్ల పూర్తిగా పాడైపోయాయి.

దీంతో యాపిల్ రైతులు లక్షల్లో నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. వారికి న్యాయం చేయమని వేడుకుంటున్నారు. వెంటనే రవాణా వ్యవస్థను సరిచేయాలని అధికారులను వేడుకుంటున్నారు. కొంతవరకు యాపిల్స్ పాడైపోగా మరికొన్ని బాగానే ఉన్నాయని అంటున్నారు రైతులు. దీంతో దేశవ్యాప్తంగా యాపిల్ ధర అధికంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనాలు వేస్తున్నారు. దీంతో మార్కెట్లో యాపిల్స్ దిగుబడి పూర్తిగా తగ్గిపోతుందని చెబుతున్నారు.