Nagarjuna Sagar: తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగైదు రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాలలో నాలుగు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొన్ని ప్రాంతాలలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించింది. హైదరాబాద్ లాంటి మహానగరాలలో ఉద్యోగులకు సెలవులు ప్రకటించారు. ఇంటి నుంచే పని చేయాలని స్పష్టం చేశారు. కాలువలు, చెరువులు, నదులు, ప్రాజెక్టులు నీటితో నిండిపోయాయి.

ఇక నాగార్జునసాగర్ లో ఏకంగా 14 గేట్లను అధికారులు ఎత్తివేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వస్తోంది. దీంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. మరో రెండు రోజులపాటు ఇలానే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు జారీ చేశారు. వర్షం కురుస్తున్న సమయంలో ప్రజలు బయటకు రాకూడదని చెబుతున్నారు. వర్షంతో పాటు ఈదురు గాలులు కూడా వీస్తున్నాయని చిన్నపిల్లలు, వృద్ధులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
నాగార్జున సాగర్ ప్రాజెక్టు 14 గేట్లను తెరిచిన అధికారులు
ఎగువన కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు రావడంతో, గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల pic.twitter.com/h4vroZSJp0
— Telugu Scribe (@TeluguScribe) August 16, 2025