TGSRTCలో త్వరలోనే కండక్టర్ ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి. 1500 పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వానికి ఆర్టీసీ ప్రతిపాదనలు ఇచ్చింది. 2013 నుంచి ఈ నియామక ప్రక్రియ నిలిచిపోగా ప్రతి సంవత్సరం పెరుగుతున్న రిటైర్మెంట్లతో కండక్టర్ల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. కొన్ని రూట్లలో డ్రైవర్లకే ఆ బాధ్యతలను అప్పగిస్తున్నారు. దీంతో వారికి విపరీతంగా భారం పెరుగుతోంది. దీనికి ప్రభుత్వం అనుమతులు జారీ చేస్తే త్వరలోనే కండక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ కానుంది.

ఇదిలా ఉండగా…తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దీంతో బస్సులలో ప్రయాణించే మహిళలు ఎలాంటి చార్జీలు లేకుండానే ఉచితంగా టికెట్ తీసుకొని వారి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. మరోవైపు తెలంగాణలో నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రభుత్వం కండక్టర్ పోస్టుల భర్తీకి అనుమతులు జారీ చేసినట్లయితే భారీ సంఖ్యలో నిరుద్యోగులు అప్లై చేసుకుంటారు. దీనివల్ల చాలామందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి.