నూనె మసాజ్ తో ఇన్ఫెక్షన్ లు దూరం….!

-

పొట్ట మీద ఉండే నాభిని బొడ్డు అంటారు. బొడ్డు పొట్టలోకి చొచ్చుకు పోయి ఉంటుంది. ఈ నాభి అనేది తల్లికి, బిడ్డకు మద్య ఉన్న సంబంధం మాత్రమే అని చాలా మంది అనుకుంటారు. కాని నాభి ద్వారా మన శరీరంలో అనేక రకాల వ్యాధులకు వైద్యం చేస్తారు. క్రమం తప్పకుండా నూనె రాయటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెపుతున్న మాట.

చాలా మంది నాభిని శుభ్ర పరచుకోరు. దీని వల్ల బొడ్డు చుట్టూ ఉన్న సూక్ష్మ క్రిములు, ధూళి కారణంగా అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. నాభి పై నూనె వేసి మసాజ్ చేస్తే వాటిని క్లీన్ చేస్తుంది. నాభి ని శుభ్రం చేయకపోతే అది లోపల నుండి, బయటి నుండి కూడా అంటువ్యాధుల భారిన పడేలా చేస్తుంది. ఆవ నూనె, టీ ట్రీ వంటి నూనె లతో శుభ్రం చేయటం వల్ల బాక్టీరియా తగ్గి వ్యాధులు దరిచేరవు. ఇంకా కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటివి తగ్గుతాయి. మహిళల్లో నెలసరి సమయంలో వచ్చే నొప్పిని కూడా తగ్గిస్తుంది.

నాభి పై ఉన్న చిన్న డాట్ లాంటి ప్రదేశం అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారంగా ఉంటుంది. ఇది శరీరంలో ఉన్న అనేక అవయవాలకు కలిపి ఉంటుంది. అందువల్ల బొడ్డు పై నూనె వేస్తే అది ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది. చంటి పిల్లలకు వేడి చేసినప్పుడు బొడ్డు లో నూనె చుక్కలు వేస్తే కొంతసేపటికి పిల్లలకు ఉపశమనం కలిగి సాఫీగా మూత్ర విసర్జన జరుగుతుంది. బొడ్డు పై నూనె మసాజ్ చేయడం వల్ల మహిళల్లో రుతు చక్రాలను సమతుల్యం చేస్తుంది. ఇంకా కంటి చూపు మెరుగు పడుతుంది. కీళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version