మష్రూమ్స్ పచ్చడి ఎలా పెట్టుకోవాలి అంటే ….!

-

పుట్టగొడుగులను ఫ్రై లేదా కూర ఇంకా కుర్మా లాగా వండుకోవటం అందరికి తెలుసు. కాని మాంసం పచ్చడి మాదిరిగా పుట్టగొడుగు పచ్చడి కూడా చేసుకోవచ్చని తెలుసా..? అయితే ఒకసారి ఈ పచ్చడి ఎలా చేయాలో చూడండి. అతి తక్కువ సమయంలో చేసే ఈ పచ్చడి ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది. ఇది అన్నం, రోటి, పుల్కాల తో తింటే బాగుంటుంది.

కావలసిన పదార్థాలు: పుట్టగొడుగులు 200 గ్రా, చింతపండు 50 గ్రాములు, నూనె 100 గ్రాములు, ఉప్పు తగినంత, పసుపు ¼ స్పూన్, కారం 20 గ్రాములు, 1 స్పూన్ ఆవాలు, మెంతులు ½ స్పూన్, 1 స్పూన్ అల్లం,వెల్లుల్లి పేస్ట్. పుట్టగొడుగులను శుభ్రం గా కడగాలి. తరువాత పొడి బట్టతో తుడవాలి. పుట్టగొడుగులను సరిపడా సైజులో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చింతపండుని ఒక గిన్నెలో వేసి నీళ్ళు పోసి స్టవ్ వెలిగించి వేడి చేయాలి. అది చల్లారాక మిక్సిలో వేసి పేస్ట్ సిద్దం చేయాలి. మెంతులు ఆవాలు పెనంలో వేసి సన్నని మంటపై వేయించి పొడి కొట్టుకోవాలి.

తయారి విధానం: స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నూనె వేడి చేయాలి. అందులో పుట్టగొడుగు ముక్కలు వేసి గోల్డ్ కలర్ వచ్చేవరకు వేయించి తీయాలి. తరువాత బాణలిలో అల్లం,వెల్లుల్లి ముద్దను వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు వేయించిన అల్లం వెల్లుల్లి పేస్ట్ లో పుట్టగొడుగు ముక్కలు, పసుపు, ఉప్పు, కారం, చింతపండు, ఆవాలు, మెంతుల పొడి వేసి బాగా కలపాలి. అంతే పుట్టగొడుగుల పచ్చడి రెడీ. దీనిని 5 నుండి 6 గంటలు ఊరనిచ్చి సర్వ్ చేసుకోవచ్చు.

పోషక విలువలు: కేలరీస్ 44, కొవ్వు 0. 8 గ్రా, కొలెస్ట్రాల్ 0 ఏం జి, పైబర్ 1 గ్రా,షుగర్స్ 2 గ్రా, పొటాషియం 318ఎం జి, సోడియం 5 ఎం జి, పిండి పదార్థాలు 3.3గ్రా, మెగ్నీషియం 9 ఏం జి.

Read more RELATED
Recommended to you

Exit mobile version