దక్షిణ కోల్ కతాలోని ఆలీపోర్ ప్రాంతంలో గల మజర్ హట్ వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా 18 మందికి గాయాలైనట్లు. మంగళ వారం సాయంత్రం 4.45 నిమిషాలకు వంతెన కూలినట్లు తెలుస్తోంది. ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే సహాయక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వీరికంటే ముందుగానే స్థానికులు పలువురిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. కోల్ కతాలో గల పురాతన వంతెనల్లో ఇది ఒకటి. ప్రమాదంలో వాహనాలు శిథిలాల కిందే చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
విచారం వ్యక్తం చేసిన సీఎం
వంతెన ప్రమాద ఘటనపై పశ్చిమబంగా ముఖ్యమంత్రి మమత బెనర్జీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. స్థానిక అధికారులు సహాయక చర్యలు చేపట్టాలని వారిని ఆదేశించారు. వాతావరణం సహకరించక పోవడం వల్ల తాను డార్జిలింగ్ నుంచి రాలేకపోతున్నట్లు పేర్కొన్నారు.