దేశం సైన్స్ వైపు అడుగులు వేస్తుంటే.. గ్రామాల్లో మూఢ నమ్మకాలు రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ మూఢ నమ్మకాల స్టాయి ఇప్పుడు ఒకరి ప్రాణాలను మరొకరు తీసుకునేంతగా మారిపోయింది. ఇటీవల జగిత్యాల జిల్లాలో మంత్రాల నెపంతో ముగ్గురిని హత్య చేశారు. కుల సంఘంలోకి పిలిచి మరి బహిరంగంగా తండ్రి కొడుకులను హత్య చేశారు. ఈ ఘటన మరవకముందే మరో మూఢ నమ్మక హత్య వెలుగు చూసింది. మంత్రాల చేస్తుందని ఆరోపిస్తు.. ఒక వృద్ధురాలిని హత్య చేశారు. ఈ దారుణమైన ఘటన ఆసిఫాబాద్ జిల్లాలోని కుటోద గ్రామంలో వెలుగు చూసింది.
కాగ కుటోద గ్రామంలో ఇటీవల శ్యామ్ రావు (12) అనే బాలుడు అనారోగ్యానికి గురి అయి మృతి చెందాడు. అయితే శ్యామ్ రావును అదే గ్రామానికి చిందిన వృద్ధురాలు భీంబాయి (65) మంత్రాలు చేయడంతోనే మరణించాడని ఆ బాలుడు తండ్రి ఆత్రం కట్టి అనుకున్నాడు. అంతే కాకుండా భీంబాయిపై కక్ష్య పెంచుకున్నాడు. ఆదును చూసి హత్య చేయాలని భావించాడు. కాగ మంగళవారం రాత్రి భీంబాయి ఇంటి బయట చలి మంట వద్ద ఉండగా.. తలపై కర్రతో శ్యామ్ రావు తండ్రి గట్టిగా కొట్టాడు. దీంతో భీంబాయికి తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే భీంభాయి మరణించింది. కాగ భీంబాయి కుమారుడు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.