ఇండియాలో 653 ఓమిక్రాన్ కేసులు… నాలుగో స్థానంలో తెలంగాణ.

-

ఇండియాలో ఓమిక్రాన్ కేసులు విజృంభిస్తున్నాయి. రోజురోజుకు కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో దేశ వ్యాప్తంగా ప్రమాదఘంటికలు మోగుతున్నాయి. క్రమంగా మిగతా రాష్ట్రాలకు కూడా ఓమిక్రాన్ విస్తరింస్తోంది. ఇప్పటికే 21 రాష్ట్రాల్లో ఓమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. దేశంలో ఇప్పటి వరకు 653 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఓమిక్రాన్ బారి నుంచి 186 మంది కోలుకున్నారు. అయితే ఇప్పటి వరకు దేశంలో ఓమిక్రాన్ బారిన పడి ఎవరూ కూడా మరణించకపోవడం కాస్త ఉపశమనం కలిగించే అంశం. బాధితులు కూడా వేగంగా కోలుకుంటున్నారు.

ఇదిలా ఉంటే ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీల్లో ఓమిక్రాన్ కేసులు తీవ్రత ఎక్కువగా ఉంది. ఈరెండు రాష్ట్రాలు దేశంలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. మూడో స్థానంలో కేరళ, 55 కేసులతో తెలంగాణ నాలుగో స్థానంలో ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటి వరకు ఓమిక్రాన్ బారి నుంచి 10 మంది కోలుకున్నారు.

దేశంలో ఓమిక్రాన్ కేసులను పరిశీలిస్తే.. మహారాష్ట్రలో  167, ఢిల్లీలో 165, కేరళలో 57, తెలంగాణలో 55, గుజరాత్ 49, రాజస్థాన్ 46, తమిళనాడులో 34, కర్ణాటకలోె 31, మధ్య ప్రదేశ్ లో 9, ఒడిశా లో 8, ఆంద్ర ప్రదేశ్ 6, పశ్చిమ బెంగాల్ లో 6, హర్యానా 4, ఉత్తరాఖండ్  4 కేసులు, చండీగఢ్ 3, జమ్మూ కాశ్మీర్ లో 3, ఉత్తర్ ప్రదేశ్ లో 2, గోవా, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, లడఖ్ లలో ఒక్కో ఓమిక్రాన్ కేసు నమోదైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version