ఢిల్లీలో కరోనా అనుమానితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా కరోనా కొత్త రూపం ఓమిక్రాన్ నేపథ్యంలో కేంద్రం అలెర్ట్ అయింది. ముఖ్యంగా రిస్క్ ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్ పోర్టుల్లోనే ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారి శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ల్యాబ్ లకు పంపారు. ప్రస్తుతం ఢిల్లీలో ఓమిక్రాన్ అనుమానితుల సంఖ్య 12కు చేరింది. దిల్లీలోని లోక్‌నాయక్ జైప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రిలో ఇప్పటివరకు 12 మంది చేరినట్లు అధికారులు తెలిపారు. గురువారం ఎనిమిది మంది చేరగా.. శుక్రవారం మరో నలుగురు చేరినట్లు పేర్కొన్నారు.
ఢిల్లీలో 12 కు చేరిన ఓమిక్రాన్ అనుమానితులు…
-