దేశంలో రోజు రోజుకు కరోనా వైరస్, ఓమిక్రాన్ వేరియంట్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అవతున్నాయి. పలు రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే విద్యా సంస్థలకు కూడా సెలవులు ప్రకటిస్తూ తమిళనాడు, ఒడిశా, ఢిల్లీ, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ రాష్ట్రంలో సోమవారం నుంచి విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తు ఉత్తర్వులు జారీ చేసింది.
విద్యా సంస్థలలో కరోనా వ్యాప్తి వేగంగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించినా.. ఆన్ లైన్ క్లాసులు మాత్రం నడుస్తాయని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. అలాగే ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా 50 శాతం సిబ్బందితోనే పని చేయాలని ఆదేశాలను జారీ చేశాయి. అలాగే పశ్చిమ బెంగల్ రాష్ట్ర ప్రభుత్వం ముంబై, ఢిల్లీ నుంచి వచ్చే విమానాల రాకపోకాలపై ఆంక్షలు కూడా విధించింది.