దేశంలో ఓమిక్రాన్ తో తొలి మరణం..! రాజస్థాన్ రాష్ట్రంలో నమోదు.

-

దేశంలో ఓమిక్రాన్ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇప్పటికే దేశంలో వేయి కన్నా ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. దేశంలో రోజురోజుకు ఓమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే ఇన్నాళ్లు కేవలం కేసులే ఉన్నా మరణాలు లేవని అనుకుంటున్న తరుణంలో దేశంలో తొలి ఓమిక్రాన్ మరణం నమోదైంది. తాజాగా రాజస్థాన్ లో ఓమిక్రాన్ మరణం చోటు చేసుకుంది.

ఇదిలా ఉంటే తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలో ఓమిక్రాన్ తో ఒకరు మరణించారు. దేశంలో మొదటి ఒమిక్రాన్​ మరణం నమోదైంది. రాజస్థాన్​ ఉదయ్​పుర్​కు చెందిన 73ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. కొంతకాలంగా అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు. అయితే దీన్ని అధికారికంగా తొలి ఒమిక్రాన్ మరణంగా ధ్రువీకరించాల్సి ఉంటుంది.

అంతకు ముందు మ‌హారాష్ట్రకు చెందిన య‌శ్వంత్ చవాన్ ఇటీవ‌ల నైజీరియా నుంచి తిరిగి వ‌చ్చాడు. ఆ వ్యక్తికి హార్ట్ అటాక్ రావ‌డంతో మ‌హారాష్ట్రలోని ఒక ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే య‌శ్వంత్ చ‌వాన్ కు ఈ నెల 28న మ‌ర‌ణించాడు. అత‌నికి ఓమిక్రాన్ వేరియంట్ కూడా సోకింది. అయితే మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం మాత్రం క‌రోనా మ‌ర‌ణం కాకుండా ఇత‌ర కార‌ణాల‌తో మ‌ర‌ణించాడ‌ని రిపోర్ట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version