కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’.ఈ చిత్రంలో మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.వరుణ్ కెరియర్ లో మొట్టమొదటి హిందీ ప్రాజెక్ట్ గా వస్తున్న ఆపరేషన్ వాలెంటైన్ మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్, మానుషీ జెట్ ఫైటర్స్ గా కనిపించబోతున్నారు
ఇదిలా ఉంటే….లేటెస్ట్గా వరుణ్ తేజ్ -మానుషి చిల్లర్ స్పెషల్ షో కేస్ ఫిల్మ్ ఫేర్తో ఓ ఇంగ్లీష్ మ్యాగజైన్పై దర్శనమిచ్చారు. ఈ రీల్ లైఫ్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్స్ ఫిల్మ్ఫేర్ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించడంతో….ఆపరేషన్ లవ్ వాలెంటైన్ అనేలా అభిమానులను అట్రాక్ట్ చేస్తోంది. ఈ కవర్ పేజీలో వరుణ్ తేజ్ స్టైలిష్ బ్లాక్ షూట్లో కనిపించగా..మానుషి చిల్లర్ బ్లాక్ కలర్ మోడ్రన్ డ్రెస్లో నెటిజన్స్ను మంత్రముగ్దులను చేస్తుంది.