మరికొన్ని రోజులలో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో వివిధ పార్టీలు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ 7 జాబితాలను విడుదల చేయగా తాజాగా ప్రతిపక్ష టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థులను చేసింది. ఇవాళ తెలుగుదేశం పార్టీ 94 మంది అభ్యర్థులను, జనసేన 24 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు మొత్తం ఫస్ట్ లిస్ట్ లో మొత్తం118 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
ఇక ప్రతిపక్ష టీడీపీ-జనసేన సీట్ల షేరింగ్ పై వైసీపీ మరోసారి సెటైర్లు వేసింది. ‘మెగా ఎక్స్ క్లూజివ్: చంద్రబాబు, పవన్ సీట్ల కేటాయింపు చర్చల లీక్డ్ వీడియో’ అంటూ అక్షయ్కుమార్ నటించిన ‘దీవానే హుయే పాగల్’ మూవీ సీన్ ను ట్విట్టర్(ఎక్స్) లో పోస్ట్ చేసింది. ‘ఏక్ తేరా.. ఏక్ మేరా’ సీన్లో అక్షయ్, స్నేహాల్ ముఖాలకు బాబు, పవన్ ఫొటోలను పెట్టింది.