ఓవైపు మండే ఎండలు.. ఢిల్లీలో తుపాను గాలులు,భారీ వర్షాలు

-

దేశవ్యాప్తంగా ఎండలు మండుతుంటే.. దేశరాజధాని ఢిల్లీలో మాత్రం భారీ వర్షాలు కురుస్తున్నాయి.రాబోయే 24 గంటల్లో తీవ్రమైన ఉరుములు, గంటకు 70 కి.మీ నుంచి 80 కిమీల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.ఇక ఢిల్లీ-NCRతో సహా అనేక ప్రాంతాల్లో శుక్రవారం కూడా ఉరుములు, మెరుపులు, గంటకు 40–90 కి.మీ వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది.భారీ వర్షాల కారణంగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఎయిర్‌పోర్టులో మొత్తం 100 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

అదేవిధంగా మరో 40 విమానాలను దారి మళ్లించినట్లు ఎయిర్‌పోర్ట్ సిబ్బంది తెలిపారు.మండు వేసవిలో వర్షాలు ఢిల్లీని అతలాకుతలం చేస్తున్నాయి.శుక్రవారం ఉదయం బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ద్వారక, ఖాన్పూర్, సౌత్ ఎక్స్‌టెన్షన్ రింగ్ రోడ్, మింటో రోడ్, లజ్‌పత్ నగర్, మోతీ‌బాగ్ ప్రాంతాలను ముంచెత్తినట్లు తెలుస్తోంది. దీంతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news