అమరావతి పునః ప్రారంభ సభకు మాజీ సీఎం జగన్ డుమ్మా కొట్టారు. నిన్న సాయంత్రమే బెంగుళూరు వెళ్లిపోయిన జగన్… అమరావతి పునః ప్రారంభ సభకు డుమ్మా కొట్టారు. అమరావతి పునః ప్రారంభ సభకు రావాలని జగన్‌కు ఆహ్వాన పత్రికను పంపింది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. స్వయంగా ప్రధాని మోడీ హాజరవుతున్న సభకు రావడానికి ఆసక్తి చూపని జగన్..అమరావతి పునః ప్రారంభ సభకు డుమ్మా కొట్టారు.

2015లోనూ అమరావతి పనుల ప్రారంభోత్సవానికి హాజరు కాలేదు జగన్. జగన్ సీఎంగా ఉండగా రాష్ట్రంలో మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చారు. తాను సీఎం అవగానే అమరావతిలో రాజధాని పనులను పూర్తిగా నిలిపివేసారు జగన్. ఇక జగన్‌కు వ్యతిరేకంగా రెండేళ్లపాటు పోరాటం చేశారు రాజధాని రైతులు.