వారాహి ఎక్కి పవన్ పిచ్చి కూతలు కూస్తున్నారని మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. పవన్ ద్రోహం చేశారని రేణు దేశాయ్ స్వయంగా చెప్పారని అంబటి చురకలంటించారు. చంద్రబాబును సీఎం చేసేందుకే పవన్ తాపత్రయమని అంబటి ఎద్దేవా చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ , చంద్రబాబు ఇద్దరిలో అసహనం కనిపిస్తోందన్నారు.
ప్రాజెక్ట్‌ల పేరుతో గత ప్రభుత్వం దోచేసిందని అంబటి ఆరోపించారు. పట్టిసీమ పేరుతో దోపిడీ చేశారని రాంబాబు పేర్కొన్నారు. దోపిడీ కోసమే చంద్రబాబు ప్రాజెక్ట్‌లను ప్రారంభించారని మంత్రి ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని రాంబాబు ఫైర్ అయ్యారు.
పవన్ కల్యాణ్ ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో చెప్పే దమ్ముందా? అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. చంద్రబాబు కోసమే ఆయన పని చేస్తున్నారని, జనసేన కార్యకర్తలను ముంచేస్తారని హెచ్చరించారు. విశాఖపై పిచ్చిపిచ్చి ఆరోపణలు చేస్తున్నారని, నిబంధనల ప్రకారమే నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు.