నిమ్మలపై మరో ప్రత్యర్ధి..పాలకొల్లులో పైచేయి సాధిస్తారా?

-

తెలుగుదేశం పార్టీ కంచుకోటల్లో పాలకొల్లు ఒకటి. ఇక్కడ ఎక్కువసార్లు టి‌డి‌పి జెండా ఎగిరింది..ఇక ఈ సీటు 2009లో బాగా హైలైట్ అయింది. ఎందుకంటే ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి పోటీ చేశారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి..తన సొంత వూరు అని చెప్పి పాలకొల్లు బరిలో పోటీ చేశారు. కానీ అనూహ్యంగా సొంత స్థానంలోనే చిరు ఓటమి పాలయ్యారు. కాకపోతే అప్పుడు తిరుపతిలో కూడా పోటీ చేయడం, అక్కడ గెలవడం జరిగింది.

ఇక 2014, 2019 ఎన్నికల్లో టి‌డి‌పి నుంచి నిమ్మల రామానాయుడు వరుసగా గెలిచారు. పూర్తిగా ప్రజల్లో ఉంటూ, సామాన్యుడు మాదిరిగా తిరిగే నిమ్మలకు ప్రజా మద్ధతు ఎక్కువే. టి‌డి‌పి అధికారంలో ఉండగా, ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ప్రజా సమస్యలపై పోరాటానికి ఎంత దూరమైన వెళ్తారు. నిత్యం ప్రజల్లోనే తిరుగుతారు. అందుకే ఈయనకు నియోజకవర్గంపై పట్టు ఎక్కువ ఉంది. ఇక్కడ ఇప్పటికీ నిమ్మలదే ఆధిక్యం. నిమ్మలకు చెక్ పెట్టడానికి వైసీపీ అన్నీ రకాలుగా అధికార బలాన్ని ఉపయోగించి రాజకీయం నడిపిస్తుంది.

కీలక నేతలని పార్టీలోకి తీసుకుంది. 2014లో వైసీపీ నుంచి మేకా శేషుబాబు, 2019లో డాక్టర్ బాబ్జీ పోటీ చేసి ఓడిపోయారు. అటు గుణ్ణం నాగబాబు, యడ్ల తాతాజీ లాంటి కీలక నేతలు వైసీపీలోనే ఉన్నారు. ఇక వీరి ఎవరిని కాదని బి‌సి వర్గానికి చెందిన కవురు శ్రీనివాస్‌ని ఇంచార్జ్ గా పెట్టారు. ఈయనకు జెడ్పీ ఛైర్మన్, ఎమ్మెల్సీ లాంటి పదవులు ఇచ్చారు. ఎన్ని ఇచ్చిన పాలకొల్లుపై పట్టు సాధించలేదు.

దీంతో ఆయన్ని పక్కన పెట్టి..ప్రముఖ వ్యాపారవేత్త, బి‌సి నాయకుడు గుడాల గోపిని రంగంలోకి దింపాలని గోదావరి జిల్లాల ఇంచార్జ్ మిథున్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. ఈయన అన్నీ రకాలుగా నిమ్మలకు సరైన ప్రత్యర్ధి అని భావిస్తున్నారట. చూడాలి మరి ఈ కొత్త ప్రత్యర్ధి అయిన పాలకొల్లులో నిమ్మలకు చెక్ పెట్టగలరో లేదో.

Read more RELATED
Recommended to you

Exit mobile version