ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానంలో ఎన్నికల కమీషనర్ గా నియమించిన కనగరాజ్ ఇప్పుడు అద్దె కట్టలేదని ఆయన అద్దెకు దిగిన అపార్ట్మెంట్ ఓనర్ ఆరోపించారు. ల్యాండ్ మార్క్ ప్రైడ్ అపార్ట్మెంట్ ఓనర్ వల్లూరు అశోక్ బాబు మాట్లాడుతూ… ఏప్రిల్ 11 నాడు ఎలక్షన్ కమిషనర్ గా కనగరాజు విజయవాడలో ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ లో దిగారని అన్నారు.
డి3 ప్లాట్ తీసుకుని అద్దె కడతామని అగ్రిమెంట్ చేసి కట్టకుండా వాయిదాలు వేశారన్నారు. ఇప్పుడు పర్మిచర్ తీసుకుని వెళతామని పంచాయతీ రాజ్ అధికారులు వచ్చారని, అధికారికంగా మేము ఒక లెటర్ ఇచ్చి తీసుకొని వెళ్లాలని కోరామని అన్నారు. అధికారులు పోలీసులకు ఫోన్ చేసి పిలిపించారని ఆవేదన వ్యక్తం చేసారు. మాకు 6 నెలలుగా అద్దె కింద ఏడు లక్షలు రావాల్సి ఉందని, అధికారులు ఎవరూ కూడా దీనిపై స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. నెలకు ఒక లక్ష 11 వేల 800 రూపాయలు అద్దె కింద చెల్లించేలా అగ్రిమెంట్ అయ్యిందన్నారు. ఈ వ్యవహారం హాట్ టాపిక్ అయింది.