సుప్రీం కోర్ట్: చెత్తను కాలిస్తే లక్ష జరిమానా.. ఎక్క‌డెక్క‌డంటే..?

-

ఇక నుంచి చెత్త‌ను కాల్చేస్తే ల‌క్ష జ‌రిమానా విధించ‌నున్నారు. ఢిల్లీలో వాతావరణ కాలుష్యం రోజు రోజుకు పెరిగిపోతుంది. అదేవిధంగా పట్టణాల్లోను వాతావరణ కాలుష్యం మరింత పెరిగే అవకాశం ఉన్నందున సుప్రీం కోర్ట్ సంచలనాత్మక తీర్పును ఈ రోజు వెలువరించింది. వీధుల్లో ఎవరైనా చెత్తను కాల్చినా, రాజధాని ప్రాంతంలో భవనాల నిర్మాణ పనులను జరిపినా అంతే కాక చెత్తను వీధుల్లో, నివాసాలకి దగ్గరలో డంప్ చేసినా వారికి అధిక మొత్తంలో జరిమానా విధించాలని తెలిపారు.

Taken at Latitude/Longitude:14.633490/120.957997. km (Map link)

జరిమానా వివరాల్లోకెళితే చెత్తను కాలిస్తే రూ.1లక్ష, చెత్తను డంప్ చేసిన వారికి రూ.5వేలు జరిమానా విధించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల‌ను ఢిల్లీ, పంజాబ్‌, హ‌ర్యానా, యూపీ రాష్ట్రాలు పాటించాల‌ని తెలిపారు. కోర్ట్ తెలిపిన నిబంధనలు ప్రజలకు చేరవేయాలని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version